మళ్లీ నిర్ణయం మార్చుకున్న రేవంత్... ఎల్.రమణ సమావేశానికి హాజరు!
- నేటి మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ సమావేశం
- గోల్కొండ హోటల్ లో ఎల్పీ సమావేశం
- తన అభిప్రాయాన్ని మరోసారి చెప్పనున్న రేవంత్
మాసబ్ ట్యాంక్ లోని గోల్కొండ హోటల్ లో బీజేపీ, టీడీపీ నేతలు సమావేశం కానుండగా, ఓ ఎమ్మెల్యే హోదాలో మాత్రమే రేవంత్ హాజరు కావచ్చని ఇప్పటికే ఎల్ రమణ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వెళ్లి తన వాదనను మరోసారి వినిపించాలన్నది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ సమావేశానికి తెలుగుదేశం, బీజేపీలకు చెందిన సీనియర్ నేతలు హాజరు కానున్నారు.