`మెర్సల్` సినిమా వివాదంపై నోరు మెదిపిన నటుడు విజయ్
- అధికారిక స్టేట్‌మెంట్ విడుదల చేసిన విజయ్
- మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు
- వివాదం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించని నటుడు
`దీపావళి సందర్భంగా విడుదలైన నా కొత్త సినిమా `మెర్సల్`ను ప్రేక్షకుల ఆదరాభిమానాలతో థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. విజయంతో పాటు ఈ సినిమాకు సంబంధించి కొంత వివాదం కూడా తోడైంది. చిత్రపరిశ్రమలో నా స్నేహితులు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు, నేతలు, మీడియా, నా అభిమానులు నాకు మద్దతుగా నిలిచారు. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు` అని విజయ్ లేఖలో పేర్కొన్నాడు.