నేను వచ్చే వరకూ రేవంత్ అధికారాలు, హోదా కట్: స్పష్టం చేసిన చంద్రబాబు
- ఎల్ రమణకు ఫోన్ చేసిన చంద్రబాబు
- రేవంత్ కు ఉన్న ఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అధికారాలు కట్
- ఎలాంటి సమావేశాలూ నిర్వహించేందుకు వీల్లేదు
- అవి టీడీపీ సమావేశాలుగా భావించవద్దు
- వచ్చిన తరువాత తుది నిర్ణయం: బాబు
పార్టీ తరఫున ఏవైనా సమావేశాలు నిర్వహించాలని భావిస్తే, రేవంత్ రెడ్డిని ఓ ఎమ్మెల్యేగా మాత్రమే భావిస్తూ ఆహ్వానించాలని సూచించారు. ఆయన అధ్యక్షతన ఎలాంటి సమావేశాలనూ అనుమతించేది లేదని, అవి పార్టీ సమావేశాలుగా గుర్తించవద్దని చంద్రబాబు ఆదేశించారు. తాను వచ్చిన తరువాత అన్ని అంశాలనూ పరిశీలిస్తానని, ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు పేర్కొన్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.