కథ నచ్చితే బయోపిక్ అయినా .. హారర్ అయినా చేసేస్తాను : రామ్
Add ap7am to your home Screen

కథ నచ్చితే బయోపిక్ అయినా .. హారర్ అయినా చేసేస్తాను : రామ్

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'ఉన్నది ఒకటే జిందగీ'
  • ముందుగా కథ నచ్చాలి 
  • ఈ తరహా కథలే చేయాలనేం లేదు
తెరపై ఫుల్ ఎనర్జీతో కలిపించే హీరోల్లో రామ్ ఒకరు. యూత్ .. ఫ్యామిలీ .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా తన సినిమాలు ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటూ వుంటాడు. ఆయన తాజా చిత్రంగా 'ఉన్నది ఒకటే జిందగీ' ఈ నెల 27వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడాడు.

"ఇక ముందు బయోపిక్స్ .. డార్క్ కామెడీ .. సోషియో ఫాంటసీ తరహా సినిమాలను చేసే ఆలోచన ఉందా?" అంటూ అడిగిన ప్రశ్నకి ఆయన తనదైన శైలిలో స్పందించాడు. "బాలీవుడ్ లో బయోపిక్స్ హవా నడుస్తోంది .. ఎవరైనా వచ్చి 'బయోపిక్' చేద్దామా అంటే, అది నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే చేస్తాను. హీరో అంటే ఇలాగే వుండాలి .. ఇలాగే చేయాలని అనుకునే టైప్ కాదు. హారర్ .. మల్టీస్టారర్ ఏవైనా చేస్తాను .. నిజానికి మన చేతులో ఏవీ ఉండదు. వచ్చిందా .. నచ్చిందా చేయడం, రాలేదూ .. వదిలేయడం .. అంతే" అంటూ సింపుల్ గా తేల్చి పారేశాడు.   
ram

More Telugu News