రేవంత్ రెడ్డితో నాకు విభేదాలు లేవు: డీకే అరుణ
- రేవంత్ రాక వల్ల నాకు ఇబ్బంది లేదు
- అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తా
- స్పష్టం చేసిన డీకే అరుణ
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీలోని కొందరు కీలక నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. మాజీ మంత్రి డీకే అరుణను కూడా ఆయన కలిశారు. ఈ విషయమై అరుణను ఓ వార్తా ఛానల్ ప్రశ్నించగా... కాంగ్రెస్ లోకి రేవంత్ రావడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడే ఉంటానని స్పష్టం చేశారు.