జమ్మూకశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. బందిపోరా సెక్టార్ లోని సరిహద్దుల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన ఉగ్రవాదులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఇద్దరు జవాన్లను కాల్చి చంపారు. దీంతో రంగంలోకి దిగిన జవాన్లు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిపడేశారు. అనంతరం ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు.