రూ.20 కోట్ల విలువైన మరకత లింగం స్వాధీనం.. రోడ్డు ప్రమాదంలో బయటపడిన వైనం!
- కారుపై అధికార అన్నాడీఎంకే పార్టీ గుర్తు
- రాజకీయ నాయకుల ప్రమేయంపైనా పోలీసుల ఆరా
- పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కారులో 8 కిలోల బరువైన మరకత లింగాన్ని గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.20 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రులను విచారిస్తున్నారు. లింగాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తదితర వివరాల గురించి ఆరా తీస్తున్నారు. కాగా, మరకత లింగాన్ని తరలిస్తున్న కారుపై అన్నాడీఎంకే జెండా ఉండడంతో ఈ ఘటనలో రాజకీయ నాయకుల ప్రమేయంపైనా పోలీసులు ఆరాతీస్తున్నారు.