నాగచైతన్య: సామాజిక మాధ్యమాల్లో నాగచైతన్య, సమంతల పెళ్లి శుభలేఖ!

  • సినీ ప్రేమజంట నాగచైతన్య - సమంత పెళ్లి రేపే
  • సామాజిక మాధ్యమాలకు చేరిన శుభలేఖ వైరల్!
  • గోవాలోని డబ్ల్యూ హోటల్ లో పెళ్లి వేడుక!
టాలీవుడ్ లవర్స్ నాగచైతన్య, సమంతల వివాహం రేపు గోవాలో జరగనుంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య, సమంతల పెళ్లి శుభలేఖ ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరింది. గోవాలోని డబ్ల్యూ హోటల్ లో ఈ పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నట్టు, రేపు మధ్యాహ్నం నుంచి పెళ్లి వేడుకలు మొదలు కానున్నట్టు అందులో పేర్కొన్నారు.

మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు మెహందీ వేడుక, ఆ తర్వాత 8.30 గంటలకు విందు, రాత్రి 11.52 గంటలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనున్నట్టు ఆ శుభలేఖలో పేర్కొన్నారు. అక్టోబర్ 7న అంటే శనివారం... మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బ్రంచ్, సాయంత్రం 5.30 - 6.30 గంటల మధ్య క్రైస్తవ పద్ధతిలో వివాహం, ఆ తర్వాత డిన్నర్, పార్టీ ఇవ్వనున్నట్టు ఈ శుభలేఖ ద్వారా తెలుస్తోంది.
నాగచైతన్య
సమంత
శుభలేఖ

More Telugu News