రహానె: రహానె పరిణతి చెందిన ఆటగాడు: వ్యక్తిగత కోచ్ ప్రవీణ్
- టీ20 సిరీస్ కు ఎంపిక కాకపోయినా హుందాగా వ్యవహరించాడు
- దేశ సేవ కోసం ఓ సైనికుడిలా రహానె ఎదురుచూస్తుంటాడు
- ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో రాణించాడన్న కోచ్ ప్రవీణ్
ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా క్రికెటర్ రహానె రాణించినప్పటికీ, త్వరలో జరగనున్న టీ20 సిరీస్ కు మాత్రం అతన్ని ఎంపిక చేయలేదు. ఓ మంచి ఆటగాడిని సెలెక్టు చేయకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో రహానె వ్యక్తిగత కోచ్ ప్రవీణ్ స్పందించారు. ఆస్ట్రేలియా జట్టుతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో ఎంతో చక్కగా ఆడాడని కితాబిచ్చారు.
ఇంత మంచి ప్రదర్శన చేసిన ఆటగాడెవరైనా, తదుపరి సిరీస్ కు తనను ఎంపిక చేయకపోతే ‘సెలెక్టర్ల తప్పిదం’ అనే వ్యాఖ్యలతో విమర్శిస్తాడని, రహానే మాత్రం ఆ విధంగా చేయలేదని, హుందాగా వ్యవహరించాడని అన్నారు. న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ కోసం సాధన చేస్తున్నాడని, ఓ ఆటగాడిగా రహానె ఎంతో పరిణతి సాధించాడని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఏ సమయంలోనైనా సరే, దేశానికి సేవ చేసేందుకు ఓ సైనికుడిలా రహానే ఎదురుచూస్తుంటాడని ప్రవీణ్ అన్నారు.