టాలీవుడ్, కోలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తమన్నాకు ఆఫర్లు తగ్గాయి. 'బాహుబలి' తరువాత కూడా ఆమెకు ఊహించినన్ని ఆఫర్లు రాలేదు. 'జై లవకుశ'లో ఐటెం సాంగ్ చేసిన తరువాత ఆమెకు మళ్లీ ఆఫర్లు క్యూకడుతున్నాయని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం సంపాదించుకుంది. అలాగే తెలుగు 'క్వీన్' సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ సంపాదించుకుంది.

 ఇలా మళ్లీ ఆఫర్లు రావడానికి కారణం, పారితోషికాన్ని తగ్గించడమేనని
అంటున్నారు. బాహుబలి వరకు కోటికి పైగా పారితోషికం అందుకున్న తమన్నా, ఇప్పుడు బాగా డిస్కౌంట్ ఇస్తోందని టాలీవుడ్ సమాచారం. దీంతోనే తమన్నాకు మళ్లీ ఆఫర్లు వస్తున్నాయని కథనాలు పేర్కొంటున్నాయి.