అప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను : సాయి పల్లవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను : సాయి పల్లవి

  •  'ఫిదా' సినిమాతో సాయిపల్లవికి పెరిగిన క్రేజ్
  •  'ప్రేమమ్' సినిమా గురించి ప్రస్తావించిన సాయిపల్లవి
  •  ప్రకృతిని ప్రేమించడం ఇష్టం
  •  ప్రకృతికి .. జీవరాశికి హాని చేయకూడదు  
'ఫిదా' సినిమాతో సాయిపల్లవి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె నాని జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తోంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె 'ప్రేమమ్' మలయాళ సినిమాకి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పింది. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో .. గుప్పెట్లో సీతాకోక చిలుకను ఉంచి .. కొన్ని క్షణాల తరువాత గుప్పెట తెరచి దానిని గాల్లోకి వదిలి సాయిపల్లవి ఆనందించాలి.

అయితే సీతాకోకచిలుకను గుప్పెట్లో ఉంచి .. తెరిచేలోగా దానికి ఏమైనా అవుతుందేమోనని ఆమె చాలా టెన్షన్ పడిపోయిందట. అలాంటివాటిని ఇబ్బంది పెట్టడం తనకి ఎంత మాత్రం ఇష్టం ఉండదనీ .. మరోసారి అలాంటి సీన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది. ప్రకృతిని ఆరాధించడం . అందులోని జీవరాశిని చూసి ఆనందించడం చేయాలి తప్ప, దేనికీ హాని చేయకూడదని చెప్పుకొచ్చింది.     
sai pallavi

More Telugu News