మోదీకి వ్యతిరేకంగా ఉన్న పోస్ట్‌ను షేర్ చేసినందుకు సస్పెన్షన్‌కి గురైన కానిస్టేబుల్
- పోస్టు గురించి ఫిర్యాదు చేసిన ఆర్టీఐ యాక్టివిస్ట్ బీఎస్ నందకుమార్
- హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదు
- మతకల్లోలాలు సృష్టించేలా ఉందంటూ ఆరోపణ
మోదీ పరిపాలనని ఉద్దేశిస్తూ `నీ లాంటి వాడు ప్రధానిగా ఉండటం నిజంగా సిగ్గుచేటు` అని అర్థం వచ్చేలా ఉన్న పోస్ట్‌ను సమీల్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అయితే ఈ పోస్ట్ కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతీశాడని పేర్కొంటూ నందకుమార్ ఫిర్యాదు చేశాడు. సమీల్‌కు మూడు ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నాయని, వాటి ద్వారా హిందూ వ్యతిరేక పోస్టులను షేర్ చేస్తూ, మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని నందకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.