20 మిలియన్ వ్యూస్ తో 'జై లవ కుశ' ట్రైలర్ దూసుకుపోయిందంతే!
Add ap7am to your home Screen

20 మిలియన్ వ్యూస్ తో 'జై లవ కుశ' ట్రైలర్ దూసుకుపోయిందంతే!

'జై లవ కుశ' సినిమా నుంచి ఇటీవల ఒక ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఫేస్ బుక్ .. యూట్యూబ్ లలో కలిసి ఈ ట్రైలర్ 5 రోజులలో 20 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. ఒక్క యూట్యూబ్ లోనే 10.5 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇక లైక్స్ లక్షల్లో ఉండటం విశేషం.

 ఎన్టీఆర్ కి గల క్రేజ్ కి .. ఈ సినిమా పట్ల అంతా చూపుతోన్న ఆసక్తికి ఈ వ్యూస్ కొలమానంగా నిలుస్తున్నాయని అంటున్నారు. ఈ సినిమా కోసమే సన్నబడిన రాశి ఖన్నా .. స్క్రీన్ పై నాజూకుగా కనిపిస్తూ మరిన్ని మార్కులు కొట్టేస్తోంది. ఈ సినిమా తరువాత ఆమె మరికొంతమంది స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.       
ntr
rasi khanna

More Telugu News