ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీలో కమెడియన్ గా సునీల్?
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీలో కమెడియన్ గా సునీల్?

ప్రస్తుతం త్రివిక్రమ్ .. పవన్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ఆయన ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాలో కమెడియన్ గా సునీల్ కనిపించనున్నట్టు సమాచారం. హీరోగా మారిన తరువాత సునీల్ ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేయలేదు.

అయితే ఈ మధ్య హీరోగా ఆయనకి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. అంతే కాకుండా ప్రేక్షకులకు .. ఆయనకీ మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. అందువలన రెగ్యులర్ గా తెరపై కనిపించడం కోసం ఒక వైపున హీరోగా కొనసాగుతూనే, మరో వైపున ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా కనిపించాలనే నిర్ణయానికి సునీల్ వచ్చినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. సునీల్ ఈ నిర్ణయం తీసుకున్న కారణంగా, త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ తో చేయనున్న తన నెక్స్ట్ మూవీలో సునీల్ కి ఛాన్స్ ఇవ్వనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.  
trivikram
ntr

More Telugu News