'జై లవ కుశ' హిందీ డబ్బింగ్ హక్కుల రేటు అదుర్స్!
Add ap7am to your home Screen

'జై లవ కుశ' హిందీ డబ్బింగ్ హక్కుల రేటు అదుర్స్!

ఎన్టీఆర్ తన కెరియర్లోనే మొదటిసారిగా మూడు పాత్రలను పోషించిన 'జై లవ కుశ' చిత్రం విడుదలకి ముస్తాబవుతోంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా .. నివేదా థామస్ కథానాయికలుగా అలరించనున్నారు. భారీ బడ్జెట్ తో కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా, భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

 ఇక ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు హిందీ ఛానల్స్ లో మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయనే సంగతి తెలిసిందే. అందువల్లనే ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కుల కోసం కొన్ని టీవీ ఛానల్స్ పోటీ పడినట్టుగా సమాచారం. చివరికి ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను 'జీ సినిమా' వారు దక్కించుకున్నట్టు చెబుతున్నారు. ఇందుకోసం వాళ్లు 11 కోట్లు చెల్లించారట .. ఇది భారీ మొత్తమేనని అంటున్నారు.  
ntr
rasi khanna

More Telugu News