ఎల్లుండి ‘శ్రీవ‌ల్లి’ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్‌.. ముఖ్య అతిథిగా మెగా హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎల్లుండి ‘శ్రీవ‌ల్లి’ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్‌.. ముఖ్య అతిథిగా మెగా హీరో!

రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ‌మౌళి తండ్రి, బాహుబ‌లి, భ‌జ‌రంగీ బాయిజాన్ వంటి చిత్రాల క‌థార‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌ ‘శ్రీవ‌ల్లి’ సినిమా ఆడియో వేడుక ఇటీవ‌లే జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ వేడుక‌కు రాజ‌మౌళి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్‌ను ఈ నెల 10న నిర్వ‌హించ‌నున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జరగనున్న ఈ ఫంక్ష‌న్‌కి ముఖ్య అతిథిగా మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ తేజ్ రానున్నాడు. ఈ సినిమాను విజ‌యేంద్ర ప్ర‌సాద్ స‌రికొత్త క‌థ‌తో తెర‌కెక్కించారు. ఈ సినిమాలో రజత్, నేహాహింగే జంటగా నటించారు. ఈ నెల 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
cherry

More Telugu News