'జై లవ కుశ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు!
Add ap7am to your home Screen

'జై లవ కుశ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు!

'జై లవకుశ' సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించనున్నాడు. ఈ సినిమా ఆడియో వేడుకను భారీగా చేయాలనుకున్నారు. అయితే వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాల వలన కుదరక, నేరుగా మార్కెట్లోకి పాటలను వదిలారు. అభిమానుల కోసం భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తామని ముందే చెప్పారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వేదిక ఖరారైంది.

ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా చూస్తున్నారు. పోస్టర్లకు .. టీజర్లకు .. ఆడియోకు ఒక రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో, సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. రాశి ఖన్నా .. నివేదా థామస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 21న విడుదల కానుంది.    
ntr
rasi khanna

More Telugu News