అదంతా పుకారే .. ఎన్టీఆర్ కి ఇవ్వాల్సింది ఇచ్చేశాడట!
Add ap7am to your home Screen

అదంతా పుకారే .. ఎన్టీఆర్ కి ఇవ్వాల్సింది ఇచ్చేశాడట!

ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూనే .. మరో వైపున నిర్మాతగాను కల్యాణ్ రామ్ తన సినిమాలను చక్కబెడుతూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ హీరోగా 'జై లవ కుశ' సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో కల్యాణ్ రామ్ నిర్మించిన రెండు .. మూడు సినిమాలకి నష్టాలు రావడం వలన, ఈ సినిమాకి ఎన్టీఆర్ చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఇదంతా పుకారు మాత్రమేననేది తాజా సమాచారం. కల్యాణ్ రామ్ అనుబంధాలకు ఎంతటి ప్రాధాన్యతనిస్తాడో .. వ్యాపార వ్యవహారాలకు అంతే ప్రాముఖ్యతనిస్తాడట. అందువలన ఇతర సినిమాలకి ఎన్టీఆర్ ఎంతైతే పారితోషికంగా తీసుకుంటున్నాడో .. అంతే మొత్తాన్ని ఎన్టీఆర్ కి అందజేశాడని తెలుస్తోంది. అసలు పారితోషికం ప్రసక్తే తీసుకురాని ఎన్టీఆర్,  సినిమా నిర్మాణం విషయంలో కల్యాణ్ రామ్ ఎంత పద్ధతిగా వుంటాడో తెలుసును కనుక కాదనలేకపోయాడట. అన్నదమ్ముల కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా, కొత్త రికార్డులకు తెరతీస్తుందనేది అభిమానుల మాట.   
ntr
rasi khanna

More Telugu News