mahesh: మహేశ్ క్రేజ్ ను తట్టుకోవడం మామూలు విషయం కాదు!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ అగ్రకథానాయకులలో మహేశ్ బాబుకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఆయన సినిమాలకి మంచి మార్కెట్ వుంది. అక్కడ ఆయనకి అభిమానులు ఎక్కువ .. అందువలన ఆయన సినిమాలకి లభించే ఆదరణ ఎక్కువ. అయినా 'స్పైడర్' రిలీజైన రెండో రోజునే ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మహానుభావుడు' సినిమా రెడీ అవుతోంది.

 మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శర్వానంద్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం 3 కోట్లను ఆఫర్ చేసిన ఓ బయ్యర్ .. మహేశ్ సినిమాకి పోటీగా రంగంలోకి దిగుతుందని తెలిసి వెనక్కి తగ్గాడట. మహేశ్ సినిమా బరిలో ఉండగా మరో సినిమాకి బయ్యర్లు దొరకడం కష్టమేననే టాక్ ఎప్పటి నుంచో వుంది. 'స్పైడర్' హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ ప్రభావం 'మహానుభావుడు'పై తీవ్రంగా పడే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. అయినా ఈ సినిమా టీమ్ అదే డేట్ ను ఖాయం చేసుకుంటుందో .. మనసు మార్చుకుంటుందో చూడాలి.  
Go Back to Shorts
mahesh
rakul

More Telugu News