భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రానున్న 'భాగమతి'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రానున్న 'భాగమతి'!

తెలుగులో కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలను రూపొందించే దర్శక నిర్మాతలకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు అనుష్క. బలమైన పాత్రలను అవలీలగా పోషించి మెప్పించడం ఆమె ప్రత్యేకత. 'అరుంధతి' .. 'రుద్రమదేవి' వంటి చిత్రాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. అలాంటి అనుష్క అదే తరహాలో 'భాగమతి' సినిమా చేసింది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం ముంబైలో ఆ వర్క్ జరుగుతోంది. నవంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే నమ్మకంతో అనుష్క వుంది.    
anushka

More Telugu News