ఇక రెండు పాటలను మాత్రమే మిగిల్చిన 'జై లవ కుశ'
Add ap7am to your home Screen

ఇక రెండు పాటలను మాత్రమే మిగిల్చిన 'జై లవ కుశ'

కల్యాణ్ రామ్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన రాశిఖన్నా ... నివేదా థామస్ .. నందిత నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ నుంచి కూడా ఎక్కడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా షూటింగును చకచకా కానిచ్చేస్తూ వచ్చారు.

 దాంతో తాజాగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసేసుకుంది. ఇక రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ లో వున్నాయి. త్వరలో వాటిని కూడా చిత్రీకరించనున్నారు. ఈ రెండు పాటలను ఫారిన్ లో చిత్రీకరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే 'జై' .. 'లవ' లుక్స్ బయటికి వచ్చాయి. త్వరలోనే 'కుశ' ఫస్టులుక్ ను వదలనున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.       
ntr
rasi khanna

More Telugu News