త్రివిక్రమ్ మూవీ కోసం బరువు తగ్గుతోన్న ఎన్టీఆర్!
Add ap7am to your home Screen

త్రివిక్రమ్ మూవీ కోసం బరువు తగ్గుతోన్న ఎన్టీఆర్!

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమా చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరి దశకి చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తయిందని అంటున్నారు.

 ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. అందుకోసం బరువు తగ్గాలనీ .. మరింత ఫిట్ గా కనిపించాలని త్రివిక్రమ్ సూచించాడట. దాంతో డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిపుణుల పర్యవేక్షణలో జిమ్ లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడట. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.   
ntr
trivikram

More Telugu News