బాలీవుడ్ కి వెళుతోన్న దుల్కర్ సల్మాన్
త్వరలో ఆయన బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. రోన్ని స్క్రూవాలా నిర్మాణంలో .. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువభాగం షూటింగ్ కేరళలోనే జరగనుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తన తాజా చిత్రం 'సోలో' పైనే దృష్టి పెట్టాడు. మలయాళ .. తమిళ భాషల్లో త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.