'రాఖీ' పండగకి 'జై లవ కుశ' నుంచి మరో స్పెషల్ గిఫ్ట్!
Add ap7am to your home Screen

'రాఖీ' పండగకి 'జై లవ కుశ' నుంచి మరో స్పెషల్ గిఫ్ట్!

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'జై లవ కుశ' చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణెలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జై .. లవ .. కుశ అనే మూడు పాత్రలను పోషిస్తున్నాడు.

 ఇప్పటికే 'జై' పాత్రకి సంబంధించిన ఫస్టు లుక్ ను .. టీజర్ ను వదిలారు. వీటికి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో 'రాఖీ' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన  'లవ' పాత్రను పరిచయం చేయబోతున్నారు. ముహూర్తం సమయాన్ని ఉదయం 10 గంటల 35 నిమిషాలుగా నిర్ణయించారు. ఈ స్పెషల్ గిఫ్ట్ ను అందించేది ఫస్టులుక్ రూపంలోనా? .. టీజర్ గానా? అనేది తేలాల్సి వుంది. 
ntr
niveda

More Telugu News