'బాహుబలి 2' తరువాత ఖరీదైన టికెట్ షారుక్ మూవీదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బాహుబలి 2' తరువాత ఖరీదైన టికెట్ షారుక్ మూవీదే!

ఇండియాలో వివిధ భాషలకి సంబంధించిన ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన సినిమాల్లో ఎక్కువ రేటు పెట్టి ప్రేక్షకులు కొనుగోలు చేసిన టికెట్స్ 'బాహుబలి 2'కి సంబంధించినవి కావడం విశేషం. ఇండియాలో అత్యంత ఖరీదైన థియేటర్ గా ఢిల్లీ లోని 'పీవీఆర్ డైరెక్టర్స్ కట్' కనిపిస్తుంది. ఈ థియేటర్లో సినిమా డిమాండ్ ను బట్టి టికెట్ రేట్స్ మారుతూ ఉంటాయి. అలా 'బాహుబలి 2' సినిమాకి గల క్రేజ్ ను బట్టి ఒక్కో టికెట్ ను 2400 రూపాయలకి అమ్మారు.

 అధికారికంగా ఇండియాలో ఇంతవరకూ అత్యధిక రేటుతో అమ్ముడైన టికెట్స్ ఈ సినిమావే. ఇక త్వరలో షారుక్ ఖాన్ మూవీ 'జబ్ హ్యారీ మెట్ సెజల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుక్ ఖాన్ - అనుష్క శర్మ జంటగా నటించిన ఈ సినిమాపై కూడా ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఈ సినిమాకి కూడా ఒక్కో టికెట్ రేటు 2400 వున్నట్టుగా చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్  ఆల్రెడీ మొదలయ్యాయి.    
shah rukh khan
anushka sharma

More Telugu News