మీడియా ఫోటోగ్రాఫర్లపై రాధికా ఆప్టే ఫైరైపోయింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీడియా ఫోటోగ్రాఫర్లపై రాధికా ఆప్టే ఫైరైపోయింది!

గ్లామర్ పరంగాను .. నటన పరంగాను రాధికా ఆప్టే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇతర కథానాయికలు చేయడానికి వెనకడుగు వేసే పాత్రలను చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తుంది. అలాంటి రాధికా ఆప్టే ప్రస్తుతం 'బజార్' అనే బాలీవుడ్ సినిమా షూటింగులో పాల్గొంటోంది. ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కొంతసేపు షూట్లో పాల్గొన్నాక లంచ్ కోసం ఆమె తన వ్యానిటీ వ్యాన్ లోకి వెళ్లింది.

 కొంతసేపటి తరువాత ఆమె బయటికి వచ్చింది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫోటోగ్రాఫర్లు ఆమె పర్సనల్ మూమెంట్స్ పై కెమెరాలను క్లిక్ మనిపించారు. తన అనుమతి తీసుకోకుండా ఫోటోలను తీయడం పట్ల ఆమె అభ్యంతరాన్ని .. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ ఫోటోలను డిలీట్ చేయమంటూ డిమాండ్ చేసింది. ఈ సినిమాకి సంబంధించి రాధికా ఆప్టే లుక్ ఇప్పట్లో బయటికి రాకుండా చూడాలని దర్శక నిర్మాతలు బలంగా అనుకున్నారట. అందువల్లనే ఆమె అలా అసహనాన్ని ప్రదర్శించి ఉంటుందని చెప్పుకుంటున్నారు.
radhika

More Telugu News