'బిగ్ బాస్' కోసం ఎన్టీఆర్ కి ఎపిసోడ్ కి 35 లక్షలు?
Add ap7am to your home Screen

'బిగ్ బాస్' కోసం ఎన్టీఆర్ కి ఎపిసోడ్ కి 35 లక్షలు?

'బిగ్ బాస్' షో కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. వారానికి రెండు సార్లు ఎన్టీఆర్ ఈ షోలో సందడి చేస్తున్నారు. భారీ స్థాయిలో రూపకల్పన  చేయడం వలన .. హిందీ - తమిళ భాషల్లో పాప్యులర్ కావడం వలన తెలుగులో ఈ షో పట్ల అందరికి ఆసక్తి పెరిగింది. అలాంటి ఈ షోకి ఎన్టీఆర్ కి ఎంత పారితోషికం అందుతుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 ఎన్టీఆర్ ను ఈ ప్రశ్న కొంతమంది విలేకరులు అడిగేశారు కూడా. అయితే ఆయన గడసరిగా సమాధానమిస్తూ .. అసలు విషయాన్ని దాటవేశారు. ఈ షోకి సంబంధించి .. ఒక్కో ఎపిసోడ్ కి ఎన్టీఆర్ 35 లక్షలు తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ షోను తొలి విడతగా 10 వారాల పాటు నిర్వహించనున్నారు. వారానికి ఎన్టీఆర్ రెండు సార్లు హోస్ట్ గా వ్యవహరిస్తాడు. అంటే ఈ 10 వారాలకి గాను ఆయనకి ముట్టే పారితోషికం 7 కోట్లు అని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ కి ఎంతిచ్చినా తక్కువే అనే అభిప్రాయంలో షో నిర్వాహకులు ఉండటం విశేషం.         
ntr

More Telugu News