డ్రగ్స్ వ్యవహారంలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ దీటైన సమాధానమివ్వడమూ విదితమే. తాజాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దిగ్విజయ్ కు దమ్ముంటే డ్రగ్ రాకెట్ లో ఉన్న టీఆర్ఎస్ నేతల పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు. దిగ్విజయ్ ఆ పని చేస్తే కనుక, 24 గంటల్లో విచారణ జరిపి వారిని అరెస్టు చేస్తామని అన్నారు. సినిమా వాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే డ్రగ్స్ వాడుతున్నారా? అని ప్రశ్నించారు. పేకాట క్లబ్బులు, గుడుంబా తయారీని ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ నేతలే అని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి