స్పెషల్ సాంగ్ కోసం అనుష్క 2 కోట్లు అందుకోనుందా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పెషల్ సాంగ్ కోసం అనుష్క 2 కోట్లు అందుకోనుందా?

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అనుష్కకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. 'బాహుబలి' సినిమాతో హిందీలోనూ ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడామె చాలా సెలక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది. అలాంటి అనుష్క 'భరత్ అను నేను' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

 మహేశ్ .. అనుష్కల పై ఈ సాంగ్ వుంటుందనీ .. అందుకోసం ఆమె బరువు తగ్గే పనిలో ఉందని చెప్పుకున్నారు. ఈ సాంగ్ లో చేస్తే అందుకు పారితోషికంగా ఆమెకి 2 కోట్లు ముట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ అనుష్క చేయకపోవచ్చని కొందరంటే, కొరటాలతోను .. మహేశ్ తోను వున్న ఫ్రెండ్షిప్  వలన ఓకే చెప్పే అవకాశం లేకపోలేదని మరికొందరు అంటున్నారు. మరి ఈ వార్తలో వాస్తవమెంతుందో గానీ, ఇప్పుడు ఈ పారితోషికం విషయమే హాట్ టాపిక్ గా మారింది.         
anushka

More Telugu News