'జై' పాత్ర ముగింపుపై ఆడియన్స్ లో ఆసక్తి!
Add ap7am to your home Screen

'జై' పాత్ర ముగింపుపై ఆడియన్స్ లో ఆసక్తి!

ఏ సినిమాలోనైనా నాయకుడు .. ప్రతినాయకుడు ఉండటం సహజం. కథ ఎలాంటి అనూహ్యమైన మలుపులు తిరిగినా చివరికి నాయకుడి చేతిలో ప్రతినాయకుడు హతమవుతాడు. 'జై లవ కుశ' సినిమాలోను ఇలానే జరుగుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. 'జై లవ కుశ' సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఈ మూడింటిలో 'జై' అనేది విలన్ పాత్ర.

 ఆ పాత్ర స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికే టీజర్ ద్వారా ఆడియన్స్ కి తెలిసిపోయింది. అలాంటి ఈ పాత్ర ముగింపు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 'లవ కుశ' పాత్రల చేతిలో 'జై' పాత్ర అంతం చేయబడుతుందా? లేదంటే అభిమానులను దృష్టిలో పెట్టుకుని క్లైమాక్స్ ను మారుస్తారా? అనే సందేహం అందరిలో తలెత్తుతోంది. చూడాలి .. దర్శకుడిగా బాబీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎలా మెప్పిస్తాడో!     
ntr

More Telugu News