వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటేమోగానీ, మారుతి సుజుకి మాత్రం హైబ్రిడ్ కార్ల ధరలను అమాంతం లక్ష రూపాయల వరకూ పెంచేసింది. చిన్న కార్ల ధరలను 3 శాతం వరకూ తగ్గిస్తున్నట్టు ప్రకటించిన మారుతి సుజుకి, సియాజ్, ఎర్టిగా వంటి స్మార్ట్ హైబ్రిడ్ మోడల్ కార్ల విషయంలో మాత్రం షాకిచ్చింది. ఈ కార్ల ధరలను రూ. లక్ష వరకూ పెంచుతున్నామని, పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. కార్ల ధరపై జీఎస్టీతో పెరిగిన పన్నులను కలిపినందునే ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది.