మనం వెళుతున్న దారిలో పాము కనిపిస్తే వణికిపోతాం.. అది అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయే వరకు ఆగి ఆ తరువాత మెల్లిగా ముందుకు కదులుతాం. అదే పాము మన ఇంట్లో కనిపిస్తే ఇక మనం పాములు పట్టేవారిని పిలిపించి, దాన్ని తరిమేసే వరకు ఆ ఇంట్లో కాలుపెట్టబోం. అయితే, ఇంట్లో ఏకంగా 42 పాములు ఉంటే? అదే జరిగింది పెద్దపల్లి జిల్లా యైటింక్లైన్ కాలనీలో ఓసీపీ -3లో హెడ్ ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న మల్లేశం ఇంటి ఆవరణలో. తమ ఇంట్లో ప్రతిరోజు ఓ పాము కనిపిస్తుండడంతో మల్లేశం భయభ్రాంతులకు గురై పాములు పట్టే వారిని పిలిపించాడు. పాములు పట్టేవారు అక్కడకు చేరుకొని పాములను వెతకడం ప్రారంభించగానే, ఒక దాని తరువాత ఒకటిగా మొత్తం 42 పాములు బయటపడ్డాయి. అన్నింటినీ పట్టుకొని వకీల్‌పల్లి సమీపంలోని చెట్లపొదల్లో పాములు పట్టేవారు వదిలేశారు. మల్లేశం ఇంటి ఆవరణలో నాగుపాము సేదతీరి ఇన్ని పిల్లలకు జన్మనిచ్చినట్లు పాములు పట్టేవారు చెబుతున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి