టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నానిపై ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని నాని పెద్ద దొంగ అని... రూ. 9 కోట్ల సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు. నాని కారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలన్నీ దెబ్బతిన్నాయని... చాలా మంది బస్సులు నడపడం కూడా ఆపేశారని అన్నారు. తామంతా కలసి ఆయనను ఎంపీగా గెలిపించినా... తనపై ఆయన కక్ష పెట్టుకున్నారని తెలిపారు. ఆయనలాంటి అహంకారి ఎంపీగా ఉండటం విజయవాడ ప్రజల దురదృష్టమని చెప్పారు. తానే గొప్పవాడినని, మిగతావాళ్లంతా వేస్ట్ అనే విధంగా నాని ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అన్ని రకాల సరైన అనుమతులతోనే తాము బస్సులు నడుపుతున్నామని... అందుకే తమ బస్సులను ఆయన టార్గెట్ చేశారని... తమ మూడు బస్సులపై అక్రమంగా కేసులు నమోదు చేయించారని అన్నారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి వ్యక్తి అని... అలాంటి వారి వల్లే తాము బస్సులు నడపగలుగుతున్నామని చెప్పారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి