టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్వేచ్ఛగా బ్యాటు ఝళిపించాడు. మూడు టీ20ల సిరీస్ లో సిరీస్ నెగ్గాలంటే గెలిచి తీరాల్సిన చివరి టీ20లో ధోనీ తనదైన శైలిలో భారీ షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. రైనా (63) నిష్క్రమణ అనంతరం జూలు విదిల్చాడు. తనకు మాత్రమే సాధ్యమైన భారీ షాట్లను సుదీర్ఘ విరామం తరువాత ఆడాడు. దీంతో అర్ధ సెంచరీతో సత్తాచాటాడు. అనంతరం జోర్డన్ వేసిన 18వ ఓవర్ ను ధోనీ (51), యువరాజ్ (27) భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులెత్తించారు. తొలి బంతిని సింగిల్ చేసిన ధోనీ, యువీకి బ్యాటింగ్ రొటేట్ చేశాడు. అంతే, తరువాతి బంతిని యువీ సిక్సర్ బాదాడు. ఆ తరువాతి బంతిని కూడా సిక్సర్ కొట్టాడు. తరువాతి బంతిని బౌండరీ బాదాడు. తరువాతి బంతిని మరో సిక్సర్ కొట్టాడు. దీంతో స్కోరు బోర్డు ఒక్కసారిగా జెట్ స్పీడు అందుకుంది. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లో ఇద్దరూ 44 పరుగులు జోడించారు. అనంతరం మిల్స్ వేసిన స్లో బంతిని అంచనా వేయడంలో తడబడ్డ యువీ టచ్ చేసి, కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 18.2 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి