జమైకా పరుగుల చిరుత ఉస్సేన్ బోల్ట్ నెలకొల్పిన అత్యంత అరుదైన రికార్డు అతని సహచరుడి కారణంగా దూరమైంది. వరుసగా మూడు ఒలింపిక్ పోటీల్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4/100 రిలే విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి 'ట్రిపుల్ ట్రెబిల్' సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన బోల్ట్, 4/100 విభాగంలో టీమ్ మేజ్ నెస్టా కార్టర్ చేసిన తప్పుకు రికార్డును కోల్పోయాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ పోటీల్లో నెస్టా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడని తేలడంతో అప్పట్లో ఇచ్చిన బంగారు పతకాన్ని వెనక్కు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇచ్చిన ఈ తీర్పుపై సీఏఎస్ (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్)లో అపీలు చేయనున్నట్టు కార్టర్ తరఫు న్యాయవాది స్టువార్ట్ స్టింప్సన్ తెలిపారు. ఆల్ టైం గ్రేట్ స్ప్రింటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న బోల్ట్, రికార్డు పదిలంగా ఉంచడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. కాగా, ఈ విషయంలో స్పందించేందుకు బోల్ట్ అందుబాటులో లేడని రాయ్ టర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి