: నర్రాజు గాకుర మా అన్నయో... మనరోజు మనకుంది అన్నయా!... అంటున్న పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘దేశ్ బచావో’ మ్యూజిక్ ఆల్బమ్ లో రెండో పాట విడుదలైంది. ‘యూట్యూబ్’ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్ లో దేశభక్తి, స్ఫూర్తిదాయకమైన పాటలను రూపొందించినట్టు జనసేన తెలుపగా, అందులో తొలి పాట 'తమ్ముడు' సినిమాలోని 'ట్రావెలింగ్ సోల్జర్' పాటను పోలి ఉండడం విశేషం.
ఇక రెండో పాట గతంలో పవన్ కల్యాణ్ దర్శకత్వం వహించిన 'జానీ' సినిమాలోని వేడుక పాట 'నర్రాజు గాకురా మా అన్నయో ముద్దుల కన్నయ్య మనరోజు మనకుంది అన్నయ్యో' అంటూ సాగే పాట బాణీని పోలి వుంది. పాట మధ్యలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల, జేఎన్యూ విద్యార్థి కన్నయ్యకుమార్ లపై జరిగిన దారుణాలను ప్రస్తావించడం గమనార్హం. ఈ రెండు పాటలు పవన్, జనసేన అభిమానులను అలరిస్తున్నాయి.