జల్లికట్టు కోసం నిరసన దీక్షలో పాల్గొన్న రజనీకాంత్, కమల హాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జల్లికట్టు కోసం నిరసన దీక్షలో పాల్గొన్న రజనీకాంత్, కమల హాసన్

జ‌ల్లిక‌ట్టు క్రీడ‌పై నిషేధం విధించ‌డం ప‌ట్ల మండిప‌డుతూ త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు చేస్తోన్న ఆందోళ‌న‌కు సినీప్ర‌ముఖులు కూడా మ‌ద్ద‌తు ప‌లుకుతున్న విష‌యం తెలిసిందే. జ‌ల్లిక‌ట్టుపై పోరాడుతున్న‌ ప్ర‌జ‌ల‌కు మద్ద‌తుగా కొద్దిసేప‌టి క్రితం రజనీకాంత్, కమల్‌హాసన్ కూడా చెన్నయ్, టీనగర్‌లోని దక్షిణ భారత సినీ కళాకారుల అసోసియేష్ ప్రధాన కార్యాలయం ముందు మౌన నిరసన దీక్షలో పాల్గొన్నారు. వారితో పాటు న‌టులు అజిత్, సూర్య, ధనుష్ కూడా ఉన్నారు. ఈ నిర‌స‌న‌ నడిగర సంఘం అధ్యక్షుడు నాజర్ ఆధ్వర్యంలో కొన‌సాగుతోంది. జ‌ల్లిక‌ట్టుకి మ‌ద్ద‌తుగా ఈ రోజు త‌మిళనాడులో థియేటర్లు తెర‌చుకోలేదు. ఈ మౌన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పెద్ద ఎత్తున న‌టీన‌టులు పాల్గొన్నారు.
jallikattu

More Telugu News