జయలలిత మృతితో చెన్నైలో జరగాల్సిన ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. జయలలిత మరణంతో తీవ్ర వేదనలో కూరుకుపోయిన తమిళ ప్రజలు ఆ బాధ నుంచి త్వరగా కోలుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా, ఇంగ్లిష్ జట్ల మధ్య నిర్వహించాల్సిన మ్యాచ్ ఇక్కడే నిర్వహించడం కుదురుతుందా? లేక వేదికను మార్చాలా? అన్నదానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, మరికొంత సమయం వేచి చూడాలని బీసీసీఐ భావిస్తోందని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు.
కాగా, డిసెంబర్ 16 నుంచి 20 వరకు ఇండియా, ఇంగ్లండ్ ఐదో టెస్ట్ చెన్నైలో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జయలలిత మృతి చెందడంతో పరిణామాలను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. దీంతో ఐదో టెస్టుపై ఉత్కంఠ నెలకొంది. చర్చలు, విశ్లేషణల్లో టెస్టు నిర్వహించడం సాహసమే అవుతుందని పలువురు పేర్కొంటుండడంతో తదుపరి చర్యలపై బీసీసీఐ పరిశీలిస్తోందని, పరిస్థితులను సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి