పాకిస్థాన్‌లోని ఓ సూఫీ ప్రార్థనా మందిరంపై శనివారం రాత్రి జరిగిన బాంబు దాడిలో 52 మంది దుర్మరణం చెందారు. మరో వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ సూఫీ ప్రార్థనా మందిరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 52 మంది మృతి చెందగా 105 మంది గాయపడినట్టు ప్రావిన్షియల్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తి తెలిపారు.
బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. బద్ధవిరోధులైన సున్నీ, షియా ముస్లింలు ఈ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు నిర్వహించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ఇది ఇస్లాంకు వ్యతిరేకమంటూ తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ సంస్థలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఐఎస్ ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ దాడి తమ పనేనని ఐఎస్ అనుబంధ న్యూస్ ఏజెన్సీ అమాఖ్ తెలిపింది. ఐఎస్ ఆత్మాహుతి దళ సభ్యుడు దాడికి పాల్పడినట్టు పేర్కొంది. అయితే ఇది ఆత్మాహుతి దాడా? మరేదైనానా? అనే విషయంలో స్పష్టత లేదని హోంమంత్రి తెలిపారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి