ఎన్నికలు ముగిసి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారమైనా చేయనేలేదు. అప్పుడే అమెరికా భవిష్యత్ ప్రెసిడెంట్ ఎవరనే దానిపై యూఎస్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలయ్యే అవకాశాన్ని డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తృటిలో చేజార్చుకున్నారని, అయితే వచ్చేసారి ఆ అవకాశాన్ని ఇండియన్ అమెరికన్, సెనేటర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్(51)కి దక్కే అవకాశం ఉందని ఓ మీడియా తన నివేదికలో పేర్కొంది.
వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఆమెకు మాత్రమే ఉందని అభిప్రాయపడింది. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కమల ఆయనను వదిలిపెట్టేది లేదని ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో రోజే కమల ఆయనపై విరుచుకుపడ్డారు. ఆయన విదేశాంగ విధానాలను తూర్పారబట్టారు. ట్రంప్‌పై ఆమె నిప్పులు చెరిగిన తర్వాతి రోజే పత్రిక ఆసక్తికర విశ్లేషణ చేయడం గమనార్హం. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ఉపాధ్యక్షుడు జో బిడిన్ లాంటి ప్రముఖులంతా ఆమెవైపే ఉండడంతో 2020 ఎన్నికల్లో కమలను అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు ఆ పత్రిక తన నివేదికలో పేర్కొంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి