పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేవుళ్లకు ధనాభిషేకం జరుగుతోంది. నోట్ల రద్దు నిర్ణయంతో బెంబేలెత్తినవారంతా కనీసం పుణ్యమైనా వస్తుందనుకున్నారో ఏమో కానీ, దేవాలయాలకు క్యూకట్టారు. దీంతో అన్ని ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి. తాజాగా షిర్డీ సాయిబాబా ఆలయానికీ రద్దయిన పాతనోట్ల రూపంలో కానుకలు వెల్లువెత్తడం విశేషం. గత మూడు రోజుల్లో షిరిడీ హూండీలలో భక్తులు 1.50 కోట్ల రూపాయలు కానుకలుగా సాయిబాబాకు సమర్పించగా, వీటిలో ఏకంగా 1.07 కోట్ల రూపాయలు రద్దైన 500, 1000 రూపాయలు నోట్లే కావడం విశేషం.
రద్దయిన నోట్లను షిర్డీ సాయిసంస్థాన్ స్వీకరించడం లేదని ప్రకటించినప్పటికీ, భక్తులు పాత నోట్లనే హుండీల్లో వేయడం విశేషం. దీంతో రానున్న రోజుల్లో కూడా ఈ నోట్ల ప్రవాహం ఆగేలా కనిపించడం లేదని ఆలయాల పెద్దలు పేర్కొంటున్నారు. దీంతో మరాఠ్వాడాలోని అనేక మందిరాల్లో ఉన్న హుండీలకు సీల్ వేశారు. కాగా, ఆలయాల హుండీలలో సమర్పించే కానుకలకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి