ఒక్క పుకారు ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ వాసులను బెంబేలెత్తించింది. దీంతో మొరాదాబాద్ వాసులు ఉప్పును కేజీలకు కేజీలు కొనుగోళ్లు చేయడంతో అక్కడ చిటికెలో ఉప్పు అయిపోయింది. ఇంతకీ ఉప్పు ఇంతలా కొనడానికి కారణమేంటంటే... 500, 1000 రూపాయల నోట్ల రద్దు కారణంగా దేశంలోని వివిధ వస్తువుల ధరలు పెరగనున్నాయని, అందులో ప్రధానంగా ఉప్పు ధర కేజీ నాలుగు వందలకు చేరుకుందని, వివిధ ప్రాంతాల్లో 400 రూపాయలకు ఉప్పును అమ్ముతున్నారని పుకార్లు బయల్దేరాయి.
దీంతో బెంబేలెత్తిపోయిన మొరాదాబాద్ వాసులు దుకాణాలపై దండయాత్రకు దిగారు. ఒక్కసారిగా భారీ ఎత్తున వినియోగదారులు ఉప్పు కొంటుండటంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. రద్దీ తట్టుకోలేక దుకాణదారులు కంగారుపడిపోయారు. కొందరు వ్యాపారులైతే దుకాణాలు కూడా మూసేసుకున్నారు. అయితే ఇవన్నీ పుకార్లని, ఈ పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రజలు నమ్మకపోవడం విశేషం.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్