భారత ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ నిపుణులు సమర్ధించారు. భారత్ తో పాటు పాకిస్థాన్ లో కూడా మీడియా చర్చల్లో మోదీ నిర్ణయం ప్రధాన ఎజెండాగా మారింది. దీంతో కరెన్సీ రద్దు నిర్ణయంపై జరిగిన చర్చల్లో 500, 1000 రూపాయల నోట్ల రద్దును అంతా స్వాగతించారు. భారత్ లాంటి అతిపెద్ద దేశంలో అవినీతిని అంతం చేయాలంటే ఇంతకు మించిన మంచి నిర్ణయం లేదని పేర్కొన్నారు. ఇంత వరకు ప్రభుత్వ విభాగాల్లో అవినీతి చేసేవారు 500, 1000 రూపాయల నోట్లను ప్రజల నుంచి దోచుకుని, దాచుకునేవారని అన్నారు.
ఇప్పుడు సాధారణ ప్రజానీకం నుంచి లంచం తీసుకోవాలంటే 100 రూపాయల నోట్లు తీసుకోవాలని, అలా ఎన్ని నోట్లు తీసుకోగలరు, వాటిని ఎంతసేపు లెక్కపెట్టగలరని వారు ప్రశ్నించారు. వాటిని దాచుకోవడం కూడా కష్టమని అన్నారు. ప్రపంచ దేశాల కరెన్సీని పరిశీలిస్తే... అమెరికా ఈ రోజు వరకు 100 డాలర్ల నోటు కంటే పెద్ద కరెన్సీని ముద్రించడం లేదని అన్నారు. బ్రిటన్ 50 పౌండ్ల కంటే ఎక్కువ నోటును వినియోగం లోకి తీసుకురావడం లేదని వారు గుర్తుచేశారు. ఈ నిర్ణయాలే ఆయా దేశాల్లో అవినీతిని పరోక్షంగా నియంత్రించాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ నోట్లను భారత్ కూడా రద్దు చేసి, కేవలం 100 రూపాయలు, అంతకంటే తక్కువ నోట్లతో నడిపిస్తే ... డబ్బు విలువ తగ్గి ఇతర విలువలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్