మాదకద్రవ్యాల స్మగ్లింగ్ రోజురోజుకీ పెరిగిపోతుండడంతో అమెరికాలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. దీంతో వందల కోట్ల విలువైన కొకైన్ తో ఓ బోటు కరీబియన్ సముద్రంలో ప్రయాణిస్తోందని, దానిలో సుమారు వెయ్యి కేజీల కొకైన్ ఉందని అమెరికా నావికాదళానికి యాంటీ డ్రగ్ పోలీసులు సమాచారం అందించారు. దీంతో సుశిక్షితులైన సిబ్బందితో ఆ బోటును లినిక్స్ హెలీకాప్టర్ లో నావికాదళం వెంబడించింది. బోటును సమీపించిన నావికాదళ సిబ్బంది, దానిని ఆపమని హెచ్చరిస్తూ బోటు చుట్టూ బుల్లెట్ల వర్షం కురిపించారు.
అయినా స్మగ్లర్లు పట్టించుకోలేదు. దీంతో హెలికాప్టర్ నుంచి ఓ మెరీన్ స్నైపర్ గురి చూసి ఇంజన్ పై కాల్చాడు. అంతే, బ్రేక్ వేసినట్టు బోటు ఠపీమని ఆగిపోయింది. అనంతరం హెలికాప్టర్ ను అనుసరిస్తూ వచ్చిన కోస్టు గార్డులు ఆ బోటులోకి చేరుకొని 350 కేజీల కొకేన్ ను స్వాధీనం చేసుకున్నారు. వారు వచ్చేసరికే స్మగ్లర్లు 650 కేజీల కొకేన్ ను సముద్రుడిపాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే కోస్టుగార్డులు స్వాధీనం చేసుకున్న కొకేన్ విలువ సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ఆపరేషన్ మొత్తం పూర్తయ్యేందుకు సుమారు ఆరు గంటల సమయం పట్టిడం విశేషం.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్