నల్లధనాన్ని అరికట్టేందుకు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బుని బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు వెళుతున్నారు. అయితే, బ్యాంకుల వద్ద ఉన్న రద్దీ వారిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోంది. బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి మరణించిన ఘటన కన్నూరులో చోటుచేసుకుంది.
కేరళ విద్యుత్ శాఖ ఉద్యోగి అయిన ఉన్ని (48) తన వద్ద ఉన్న రూ.5.5 లక్షల పెద్దనోట్లను బ్యాంక్‌లో వేసేందుకు నిన్న కన్నూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్‌కు వెళ్లాడు. అయితే, బ్యాంకు వద్ద జనం బారులు తీరి ఉండడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ ఈ రోజు బ్యాంకుకు వచ్చాడు. బ్యాంక్ ఉన్న భవనం మూడో అంతస్తులో ఉండడంతో పైకి ఎక్కాడు. అయితే, అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకు పడి మృతి చెందాడు. ఆయన దగ్గర ఉన్న బ్యాగ్‌లో 5.5 లక్షల రూపాయల మొత్తంతో కూడిన 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయని, అయితే, ఉన్ని ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అంశం తెలియాల్సి ఉంది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్