పెద్ద నోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఈ రోజు దేశంలోని చిన్న బ్యాంకుల్లో తమ వద్ద ఉన్న పాత నోట్లను వినియోగదారులు భారీగా డిపాజిట్ చేశారు. గ్రామీణ, కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లోని వినియోగదారులు తమ అకౌంట్లలో భారీగా డబ్బుని డిపాజిట్ చేసినట్లు సమాచారం. డబ్బు ఎక్కువగా పోగుచేసుకున్న కొందరు వ్యక్తులు తమ కుటుంబ సభ్యులు, తెలిసిన వారి పేర్లతో బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలు తెరుస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు జరిపే లావాదేవీలపై మరోవైపు అధికారులు నిఘా పెట్టిన సంగతి తెలిసిందే.