నిన్నటి వరకు భారత్ పై దుమ్మెత్తిపోసిన చైనా మీడియా ఇప్పుడు తన దృష్టిని ట్రంప్ మీదకు మళ్లించింది. తనకు నచ్చని ప్రపంచ దేశాలపై ఎప్పుడూ నిప్పులు చెరిగే చైనా మీడియా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో తట్టుకోలేకపోతోంది. హిల్లరీ క్లింటన్ గెలుస్తారని తమ వ్యాపార, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలకు ఎలాంటి ప్రతిబంధకం ఉండదని ఎన్నో లెక్కలు వేసి, ఆశలు పెంచుకున్న ‘బీజింగ్ మౌత్ పీస్’ (మీడియా సంస్థలు) లకు ట్రంప్ విజయం జీర్ణం కావడం లేదు. దీంతో చైనా ప్రధాన పత్రికల ఎడిటోరియళ్ల నిండా ట్రంప్ పై ఆరోపణలతో దుమ్మెత్తిపోశాయి. అమెరికా సహా ప్రపంచం మొత్తం ట్రంప్ ను అమెరికా అధ్యక్షుడిగా అంగీకరించడం లేదని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొడంతో ఆగకుండా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘ఏదో తేడా’ జరిగిందని అనుమానం వ్యక్తం చేసింది.
ట్రంప్ విజయం అమెరికా రాజకీయాలకు భారీ దెబ్బ అని అభిప్రాయపడింది. ప్రధానంగా అమెరికా మీడియా ట్రంప్ ను అలక్ష్యం చేసిందని విమర్శించింది. అలాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడయ్యాడంటే ప్రస్తుతమున్న అమెరికా రాజకీయాల్లో ఏదో తప్పు ఉండే ఉంటుందని పేర్కొంది. అంతే కాకుండా దీపావళి ముందు 'బ్యాన్ చైనా ప్రోడక్ట్స్' ఉద్యమం సమయంలో భారత్ పై బెదిరింపులకు దిగినట్టుగా, భవిష్యత్తులో జరిగే చైనా-అమెరికా బంధం, రష్యా-అమెరికా సంబంధాల ప్రభావం మొత్తం అంతర్జాతీయ సమాజం మీద పడుతుందని ఏకంగా ప్రపంచంపైనే బెదిరింపులకు దిగింది. అమెరికా గత అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ లాగే ట్రంప్ కూడా ‘విన్-విన్’ (తమ వ్యాపారాలు, ఉద్యోగాలకు అడ్డు రాకుండా) పాలసీతో వెళ్తే బాగుంటుందని ముందస్తు సూచనలు చేసింది. అలా కాకుండా ట్రంప్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని టార్గెట్ చేస్తే కనుక చైనా తన సొంత బలంతో తనను తాను రక్షించుకోవాల్సి ఉంటుందని కథనాలు వండుతోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి