కుమార్తెతో కలిసి డిన్నర్ చేద్దామని హోటల్‌కి వెళ్లిన ఓ మహిళకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అంతేగాక, ఆమె తీవ్రగాయాల పాలైంది. ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పునిస్తూ మహిళపై దాడి చేసిన 17 ఏళ్ల హోటల్ వెయిటర్ కు శిక్షవిధించింది. వివరాల్లోకి వెళితే పశ్చిమ చైనాలోని వెంజ్వుకు చెందిన లిన్ అనే మహిళ కుటుబం గత సంవత్సరం ఆగస్టులో అక్కడి ‘మిస్టర్ హాట్ పాట్’ హోటల్లో భోజనం చేస్తుండగా వెయిటర్ జూతో గొడవపెట్టుకుంది. తాగునీరు సరిగా లేదని వెయిటర్ ను ఆమె అడగగా ఆమెకు సరైన సమాధానం చెప్పలేదు.
దీంతో లిన్ హోటల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెగిటివ్‌గా రివ్యూ పోస్ట్ చేసింది. ఆ దేశంలో కస్టమర్ల రివ్యూలను చూసే కొత్త కస్టమర్లు వస్తుంటారు. ఆమె పోస్ట్ చేసిన రివ్యూని చూసిన వెయిటర్ జూ అలా ఎందుకు చేశావంటూ మరోసారి ఆమెతో గొడవ పడి, పోస్టు తీసేయాలని అన్నాడు. అందుకు లిన్ ససేమిరా అనడంతో ఆవేశంతో ఊగిపోయి వంటగదిలో సిద్ధంగా ఉన్న వేడి వేడి సూప్‌ను తీసుకొచ్చి ఆమెపై పోశాడు. అయినప్పటికీ కోపం తగ్గించుకోని వెయిటర్ ఆమెను చితక్కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ ఆ హోటల్ సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి.
ఆ మహిళపై జు చేస్తోన్న దాడి ఆపేలా చేయడానికి అక్కడి ఐదురుగు వ్యక్తులు ప్రయత్నించాల్సి వచ్చింది. ఈ దాడితో ఆమె ముఖం, మెడభాగం, భుజాలు, చర్మం బాగా కాలిపోయి ఆసుపత్రి పాలయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వెయిటర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు. న్యాయస్థానం ఆ వెయిటర్‌కి 22 నెలల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది.ఈ దాడికి సదరు హోటల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని చెప్పింది. గాయపడ్డ మహిళక ఆసుపత్రి చికిత్స నిమిత్తం 5,77,000 యెన్లు హోటల్ నుంచి ఇప్పించేలా ఆదేశించాలని లిన్ కోరింది. అయితే, ఆమె వైద్యానికి హోటల్ ఇప్పటికే ఖర్చులు చేసిందని, 2,37,000 (35000డాలర్లు) మాత్రమే చెల్లించాలని హోటల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
More Telugu News
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!