టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నవంబర్ 9 నుంచి రాజ్ కోట్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ లో విజయంపై రెండు జట్లు ధీమాగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ వరుస విజయాలతో కెప్టెన్ గా ఇప్పటికే నిరూపించుకుని, సరికొత్త సవాల్ కోసం సిద్ధంగా ఉండగా, ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా కుక్ కు ఇదే చివరి సిరీస్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య సిరీస్ హోరాహోరీ జరగనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ పై సత్తాచాటి భారత్ లో అడుగుపెట్టిన ఇంగ్లిష్ జట్టుకు భారత్ లో మంచి రికార్డు ఉంది. గతంలో టీమిండియాకు చుక్కలు చూపించిన ఘనత ఇంగ్లండ్ జట్టుకే ఉంది.
దీంతో ఈ సిరీస్ ఆసక్తికరంగా మారింది. దీనిపై దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, కోహ్లీ సేన చేతిలో ఇంగ్లండ్ కు వైట్ వాష్ తప్పదన్నాడు. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల జట్ల రికార్డులను ఓసారి పరికిస్తే ఇంగ్లండ్ రికార్డు బాగుంది. 2000 నుంచి ఇప్పటి వరకు భారత్ కు వచ్చిన దేశాల్లో ఇంగ్లండ్ జట్టు ఉత్తమమైనదని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే గత దశాబ్ద కాలంలో సొంతగడ్డపై భారత్ ను ఓడించగలిగిన జట్టు కూడా ఇంగ్లండేనని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ సిరీస్ రెండు జట్ల మధ్య పసందైన క్రీడా విందునందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి