పూణెలోని బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాల అమ్మాయిల పట్ల వివక్ష చూపి విమర్శలకు గురవుతోంది. ఇక్కడి లైబ్రరీని 24 గంటలూ తెరిచేవుంచుతారు. పీజీ వైద్య విద్యార్థులు, యువ రెసిడెంట్ డాక్టర్లు, ఇంటర్న్ షిప్ చేసేవారు ఎప్పుడైనా వచ్చి చదువుకుంటుంటారు. రాత్రిళ్లు సైతం లైబ్రరీ సందడిగానే ఉంటుంది. తాజాగా, అమ్మాయిలపై నిషేధం విధిస్తూ, రాత్రి 11:15 గంటలకెల్లా అందరు విద్యార్థినులనూ హాస్టళ్లకు పంపేస్తున్నారు. యూజీసీ నిబంధనల మేరకు ఆడ, మగ తేడా చూపుతూ ఎలాంటి ఉత్తర్వులను ఇచ్చే వీల్లేకున్నా, మహిళల స్వేచ్ఛను హరించేలా కాలేజీ డీన్ అజయ్ చందన్ వాల్ నిర్ణయం తీసుకున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
కాగా, ఈ లైబ్రరీకి అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో కూడా చదువు పేరిట అమ్మాయిలు వస్తున్నారని, ఇది వారికి క్షేమం కాదన్న ఉద్దేశంతోనే నిబంధనలు మార్చామని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం అమ్మాయిల భద్రత గురించి ఆందోళనతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని చందన్ వాలే చెబుతున్నారు. ఇదిలావుండగా, నెల రోజుల్లో ఆలిండియా పీజీ ప్రవేశపరీక్ష ఉన్నందున, పుస్తకాలు కొనుగోలు చేసే స్తొమతలేని వారు రాత్రుళ్లు వంతుల ప్రకారం లైబ్రరీలో చదువుకుంటున్నారని, ఈ సమయంలో ఆంక్షల వల్ల ర్యాంకులు కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి